Mahaa Daily Exclusive

  సిపిఎం సీనియర్ కార్యకర్త పోతురాజు పుల్లయ్య మృతి నివాళులు అర్పించిన నేతలు..!

Share

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి చెందిన సిపిఐ(ఎం) సీనియర్ కార్యకర్త పోతురాజు పుల్లయ్య(40) ఆదివారం మృతి చెందారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పోతురాజు పుల్లయ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే నరేంద్ర, దాసరి మల్లయ్య, మాజీ సర్పంచ్ బానోతు బన్సీలాల్ సందర్శించి మృతదేహంపై పార్టీ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర, భూస్వామ్యులకు నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిన ఈ ప్రాంతంలో అమరజీవుల బాటలో పోతురాజు కుటుంబం నడిచిందన్నారు. తండ్రి పోతురాజు కోటయ్య పార్టీ సభ్యుడుగా తదుపరి పుల్లయ్య పార్టీ సభ్యుడుగా, శాఖ కార్యదర్శిగా పార్టీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులకు గెలుపుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోతురాజు పుల్లయ్య కడవరకు పోరాడారని ఆయన మృతి కుటుంబానికే కాక పార్టీకి కూడా తీరని లోటన్నారు. పుల్లయ్య ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మృతునికిక భార్య దేవి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వజ్జా రామారావు, శాఖ కార్యదర్శులు తేజావత్ చందర్, దాసరి సైదులు, నాయకులు పచ్చిపాల రమేష్, వెంకన్న, నరసయ్య, మాజీ ఎంపిటిసి గడ్డం వెంకటేశ్వర్లు, మూడు మోహన్. జాల సాంబ, మృతుడి సోదరులు సైదులు, నాగార్జున్ అంతిమయాత్రలో బంధుమిత్రులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.