Mahaa Daily Exclusive

  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల
జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
సోమవారం మంచిర్యాల జిల్లా సమీకృత కార్యాలయ భవన సమావేశ మందిరంలో డిసిపి ఎ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నాటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో జరగనున్న వేడుకలను అధికారులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారి జాబితా ఈ నెల 13వ తేదీలోగా సిద్ధం చేయాలని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం, బ్యాండ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, నస్పూర్ మండల తహశిల్దార్ సంయుక్త ఆధ్వర్యంలో కుర్చీల ఏర్పాటు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యవసాయ-ఉద్యానవన, అటవీ, ఐ.సి.డి.ఎస్., పశుసంవర్ధక – మత్స్యశాఖ, వైద్య-ఆరోగ్య, భూభారతి, గ్రామీణాభివృద్ధి, విద్య-వయోజన విద్య, సంక్షేమశాఖలు, బ్యాంకర్స్ ఆధ్వర్యంలో సైబర్అమ్-ఆర్థిక అక్షరాస్యత సంబంధించి ప్రగతి వివరాలతో స్టాళ్ళు ఏర్పాటు చేయాలని తెలిపారు. సందేశం రూపొందించడం కొరకు అన్ని శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రశంసా పత్రాల గ్రహీతలు, ప్రజలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రశంసా పత్రాల పంపిణీ, పతాక ఆవిష్కరణ, వేదిక అలంకరణ, పుష్పగుచ్చాలు, వేదిక తయారీ, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, మైక్, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రముఖుల ఆహ్వానం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర ఏర్పాట్లు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వేడకలకు తప్పనిసరిగా హాజరు కావాలని, వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేసే దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.