Mahaa Daily Exclusive

  సత్తుపల్లిలో బాలికల మధ్య ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు వేడుక.!

Share

సత్తుపల్లి , మహా.
సత్తుపల్లి బాలికల ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి. కేక్ కట్ చేసి విద్యార్థులతో మాట్లాడిన ఆమె, చదువులో కృషి చేయాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తన చిన్ననాటి పోరాటం, ప్రభుత్వ పాఠశాలలో చదివి డాక్టర్ అయిన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. “తల్లిదండ్రుల మాట విని, మంచి దిశగా ఆలోచిస్తే జీవితంలో విజయాలు సాధించవచ్చు” అని ఆమె అన్నారు.

ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు, గురువులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని సూచించారు. సెల్‌ఫోన్‌పై సమయం వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించిన ఆమె, ఉచిత కరెంట్, స్లీపర్ల నియామకం, యూనిఫామ్‌లు, పుస్తకాల పంపిణీ, హాస్టల్ సౌకర్యాల మెరుగుదల, 200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వంటి అంశాలను ప్రస్తావించారు.

“మీ భవిష్యత్తు వెలుగొందడమే మా ఆనందం” అని, విద్యార్థులకు తన ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు.