తల్లాడ, ఆగస్టు 11 ( మహా):-
సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జన్మదిన వేడుకలను సోమవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల నాయకులు రాయల రాము ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాముతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు కె.వి, తుమ్మలపల్లి రమేష్, వేమిరెడ్డి కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువకులు ఉత్సాహంగా రక్తాన్ని దానం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము మాట్లాడుతూ తల సేమియా బాధితులు రక్తం లేక అనేక అవస్థలు పడుతున్నారని, ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపా అనిల్ చౌదరి, గణేశుల రవి, అయినాల నరసింహారావు, పొట్రు శరత్ బాబు,మూకర ప్రసాద్, బండి బాలసౌరి, పస్తం మద్దిరామయ్య, గుజ్జర్లపూడి చింటూ, తదితరులు పాల్గొన్నారు,







