ఖమ్మం సిటీ, మహా.
గోర్ బంజారా సంప్రదాయాలను ప్రతిబింబించే తీజ్ ఉత్సవాలు ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రావణ మాసంలో తొమ్మిది రోజులపాటు పెండ్లి కాని యువతులు గోధుమలను నానబెట్టి మొలకలు వచ్చేవరకు పూజలు చేసి, చివరి రోజు శోభాయాత్ర నిర్వహించి చెరువులు, నదుల్లో నిమజ్జనం చేశారు.
ఈ ఉత్సవాలు తెలంగాణలోని 33 జిల్లాలతో పాటు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, ఖమ్మం బంజారా భవన్, ఎదులాపురం, శ్రీరామ్ నగర్ తదితర ప్రదేశాల్లో కూడా నిర్వహించబడ్డాయి. గోర్ బంజారా జాతి విశిష్టతను చాటిన ఈ వేడుకలకు రాష్ట్ర గోర్ బంజారా ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ సహా పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
Post Views: 38







