కాటారం, మహా : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కొంటూ పడడం ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కాటారం మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన పాలనలో మార్పు చేసి చూపించామని, బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపిందని ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్, పేద ప్రజలకి ఇవ్వలేదని శ్రీధర్ బాబు విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి, సన్న బియ్యం పంపిణీ పథకాలు ప్రజల కోసం చేపట్టామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని శ్రీధర్ బాబు కోరారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులు అవాకులు చెవాకులు మాట్లాడుతూ పత్రికలలో పేర్లు రావడానికి కోసం విమర్శిస్తుంటారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కాటారం సబ్ డివిజన్లో 4 వేల మందికి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అష్ట ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సింగిల్ విండో చైర్మన్ తోటపల్లి ప్రశాంత్ రెడ్డి,ఐదు మండలాల తహసీల్దారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పామాయిల్ పెంపకానికి అత్యధిక ప్రోత్సాహం
రాష్ట్రంలో రైతులకు రెండు రకాల ఆదాయాన్నిచ్చే పామాయిల్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రైతులు ఈ దిశగా ముందుకు సాగాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మండలంలోని ధన్వాడ గ్రామంలో శ్రీధర్ బాబు సొంత భూమి నాలుగు ఎకరాలలో పామాయిల్ మొక్కలనునాటారు. అమ్మాయిలు చెట్ల పెంపకం ద్వారా నాలుగేళ్లకు పామాయిల్ తో ఆదాయం నాలుగేళ్లలో అంతర పంటగా మిర్చి పత్తి పంటల ద్వారా ఆదాయం పొందవచ్చునని అన్నారు. అమ్మాయిలు మొక్కల పెంపకానికి ఎస్సీ, ఎస్టీ, బి సి రైతులకు సబ్సిడీ ఉందని రైతులు వినియోగించుకోవాలని కోరారు







