వరంగల్ మహా
వెహికల్ ట్రాకింగ్ అప్లికేషన్(ఆప్) పై శానిటరీ ఇన్స్పెక్టర్ లకు అవగాహన అవసరం అని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో గల ఐ సి సి సి కేంద్రం ను కమిషనర్ ఆకస్మికం గా సందర్శించి వాహనాల ట్రాకింగ్ తీరును అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకొని సమర్థవంతం చేపట్టుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ సానిటరీ ఇన్స్పెక్టర్లకు వెహికల్ ట్రాకింగ్ ఆప్ పై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని నగర పరిధిలో ఉన్న అన్ని శానిటేషన్ వాహనాలను ఐదు జోన్లుగా విభజించి ఆయా జోన్లకు సానిటరీ ఇన్స్పెక్టర్ తో పాటు ఒక ఆపరేటర్ ను కేటాయించి సానిటేషన్ కు చెందిన వాహనాలు పనిచేస్తున్నాయా? లేదా? అట్టి వాహనాల కదలికలు గమనించాలని ఒక వేళ వాహనం లో కదలిక లేకపోతే ఎందుకు కదలడం లేదో అందుకు గల కారణాలను విశ్లేషించాలని ఒకవేళ మరమత్తులు అవసరమా తదితర విషయాలు నమోదు చేసుకోవాలని అన్ని శానిటేషన్ వాహనాల కండిషన్ (స్థితిగతులు)నమోదు చేసుకొని మంగళవారం లోగా సమగ్ర సమాచారం తో కూడిన రిపోర్ట్ తనకు అందజేయాలని కమిషనర్ అన్నారు.
వెహికల్ షెడ్ ను ఆకస్మిక తనిఖీ
హన్మకొండ లోని బాల సముద్రం లో బల్దియా నిర్వహిస్తున్న వెహికల్ షెడ్ ను కమిషనర్ ఆకస్మికం గా తనిఖీ చేశారు.
ఇటీవల రెండు పడక గదుల ఇండ్లు కేటాయించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గుడిసెలను తొలగింపజేసిన క్రమంలో అక్కడ సానిటేషన్ కు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేయాలని కమిషనర్ సి ఏం హెచ్ ఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ మహేందర్, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఈ ఈ లు రవికుమార్, మాధవి లత, డి ఈ లు కార్తీక్ రెడ్డి, రాగి శ్రీకాంత్, ఏ ఈ లు సరిత, ఫణి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు







