వరంగల్ మహా;
ప్రజావాణి ఫిర్యాదులకు వారం లోగా పరిష్కారం చూపాలని జీ డబ్ల్యూ ఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు
సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రదాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో
కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొని
ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆయా విభాగాల ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను వేగవంతం గా పరిష్కరిస్తూ పెండింగ్ లో ఉండకుండా చూడాలని, 24 గం.లోగా శానిటేషన్ విభాగానికి అందిన ఫిర్యాదు లు పరిష్కారం కావాలని, గార్బేజ్ బిన్ లు లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే అట్టి సమస్య పట్ల దృష్టి సారించాలని అన్నారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పన్నుల విభాగానికి చెందిన ఈ వారం లో స్వీకరించిన ఫిర్యాదులు పెండింగులో ఉండకుండా వచ్చేవారం లోగా పరిష్కరించబడాలని తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ లో పిచ్చి మొక్కలు చెత్త చెదారం ఉండడం వల్ల వర్షాకాలం నేపద్యం లో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అలాంటి ప్లాట్ లను శుభ్రం చేసుకునేలా యాజమాన్యాలకు సూచించాలని తెలిపారు. ఈనెల 21 వరకు నగరం లో వివిధ ప్రాంతాల్లో బోనాలు పండుగలు జరుగుతున్న నేపద్యంలో సంబంధిత ఆలయ ల వద్ద ఎలక్ట్రికల్ శానిటేషన్ ఏర్పాట్ల తో పాటు డస్ట్, పారిశుద్ధ్యం నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయం తో పనిచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భం గా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు విభాగాల వారిగా
1.ఇంజనీరింగ్….23
2.హెల్త్ & సానిటేషన్…..11
3.ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)…09
4.టౌన్ ప్లానింగ్…44
5.హార్టికల్చర్….02
6.ఎలక్ట్రికల్…..02 మొత్తం…. 91 గా అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి , ఇన్చార్జి ఎస్ ఈ, సిటీ ప్లానర్ లు మహీందర్ రవీంద్ర రాడేకర్, సిహెచ్ ఓ లు రమేష్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, వింగ్ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు







