Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి రాష్ట్ర హౌసింగ్ ఏండి విపి గౌతమ్ ..!

Share

హన్మకొండ మహా;

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో వేగం పెంచాలని రాష్ట్ర హౌసింగ్ ఏండి విపి గౌతమ్ అన్నారు.
సోమవారం నగరానికి చేరుకున్న ఏం డి బల్దియా పరిధి లోని హన్మకొండ వరంగల్.ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతున్న పలు ఇందిరమ్మ గృహాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి సమర్థవంతం గా పూర్తి చేయుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏండి
హన్మకొండ పరిధి లోని 31 వ డివిజన్ న్యూ శాయంపేట వరంగల్ పరిధి 33 వ డివిజన్ పరిధి లో గల ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని హౌసింగ్ ఎండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఈ సందర్భంగా న్యూ శాయంపేట లో పరిశీలించే క్రమం లో హౌసింగ్ ఏం డి మాట్లాడుతూ పి ఎం ఏ వై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) లో భాగం గా ఓ టి పి ,జియో ట్యాగింగ్ నమోదు ఆశాజనకం గా లేదని వేగం పెంచాలన్నారు. ఎస్ ఆర్ ఆర్ తోట లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పేమెంట్స్ అకౌంట్లో జమ అవుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు మంజూరై ఇప్పటివరకు నిర్మాణం మొదలు పెట్టని వారికి నోటీసులు అందజేసి నిర్మాణం మొదలుపెట్టేలా చూడాలని ఆగస్టు 15 లోగా నిర్మించబోయే ఇళ్లకు మార్కింగ్ ఇవ్వాలని ఆధార్ వెరిఫికేషన్ తో పాటు ఈ ఎం ఈ వై పోర్టల్ లో ఇళ్లకు సమాచారాన్ని నమోదు చేయడం తో పాటు జియో కోఆర్డినేట్స్ తో సమన్వయం చేసుకొని తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు.
అంతకు ముందు నగరానికి చేరుకున్న రాష్ట్ర హౌసింగ్ ఎండీ నీ మర్యాదపూర్వకం గా కలిసిన బల్దియా కమిషనర్ పూల మొక్క ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హౌసింగ్ పి డి సిద్దార్థ నాయక్, కార్పొరేటర్ మామిండ్ల రాజు , డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, డి ఈ రవీందర్ , తహసీల్దార్ బావు సింగ్, తదితరులు, పాల్గొన్నారు