AP: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అక్రమమని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలపై దాడులకు దిగడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందన్నారు.








