- స్కామేష్
- వేలకోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ మాజీ సీఎస్
- జిఎస్టీ స్కాంలో అడ్డంగా బుక్కయిన పెద్ద ఆఫీసర్
- ధరణిలో అనేక అవకతవకలు.. రెవెన్యూలో తవ్విన కొద్దీ అవినీతి
- ప్రజల సొమ్ము.. ఫలహారం
(హైదరాబాద్, వేదిక బ్యూరో)
తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను స్కామేష్ కుమార్ గా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ముందునుండీ ఆరోపిస్తున్నాయి. తాజాగా వేయికోట్ల జీఎప్టీ కుంభకోణంలో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై కేసు కూడా నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖను, రెవెన్యూ శాఖను ఆయన కుళ్ళబొడిచాడని, వేల కోట్ల ఆక్రమణల్లో, అక్రమాల్లో కీ రోల్ పోషించాడన్న ఆరోపణలు ఉండగా, ఇపుడు ఆధారాలతో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ లో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో సుమారు రూ. 1000 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. కమర్షియల్ టాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పలువురి పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమర్షియల్ టాక్స్ అడిషనల్ కమిషనర్ , డిప్యూటీ కమిషన్లర పై కేసు నమోదు అయ్యింది. నిందితులపై 406, 409, 120 (బి) ఐటీ చట్టం కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ధరణి దందాలపై అంతర్గతంగా విచారణలు సాగుతున్నాయి. తప్పుచేసిన అధికారులపై ప్రభుత్వం ఏరకంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి.








