కుమరం భీం ఆసిఫాబాద్ మహా : రైతులు నానో యూరియాను వినియోగించాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ సూచించారు. మంగళవారం దాహేగాం వ్యవసాయ కార్యాలయం పరిధిలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన రైతులకు నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను విపులంగా వివరించారు.రామకృష్ణ మాట్లాడుతూ సాధారణ యూరియాతో పోలిస్తే నానో యూరియా ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వాడటానికి సులభంగా ఉండటమే కాకుండా నీరు, నేల మరియు పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం కలిగించదని తెలిపారు. ఇకపుడు, ఇప్పటికే నానో యూరియాను పంటలలో ఉపయోగించి మంచి ఫలితాలు సాధించిన ఒక ఉత్తమ రైతు అనుభవాలను సమావేశంలో పంచుకున్నారు. రైతుల పంట ఉత్పాదకత పెరగడమే కాకుండా, ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. రైతులు సాగు సంబంధిత ఏవైనా సందేహాలు, సమస్యలు ఎదుర్కొంటే నేరుగా వ్యవసాయ శాఖను సంప్రదించమని అధికారి రామకృష్ణ పిలుపునిచ్చారు.నానో యూరియా వినియోగం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఒక నూతన ఆవిష్కరణగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లు వంశీ, ఆనంద్ తో పాటు అనేక మంది రైతులు పాల్గొన్నారు.








