ఖమ్మం , మహా.
లంబాడీలు ఎస్టీలు కాదని చెబుతూ జరుగుతున్న ప్రచారాన్ని లంబాడీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ ఈరునాయక్ మాట్లాడుతూ… లంబాడీలు రాజ్యాంగబద్ధంగానే ఎస్టీలుగా గుర్తింపు పొందారని స్పష్టం చేశారు. కానీ కొందరు ప్రజా ప్రతినిధులే సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని నోటీసులు పంపించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. లంబాడీలను ఎస్టీలు కాదని కించపరచడం సమాజానికి అనర్థమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బానోత్ కిషన్ నాయక్, భూక్యా బిక్షపతి రాథోడ్, డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, రవి రాథోడ్, మంగ్య నాయక్, రామ్మూర్తి నాయక్, తారా దేవి, సోమ్లా నాయక్, వెంకట్రావు, హీరాలాల్, శోభన్ నాయక్, లక్ష్మణ్ నాయక్, భాస్కయ్య నాయక్, భీముడు నాయక్, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.






