AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో 53 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. జగన్ ఐదేళ్ల పాలనలో సీఎం సహాయనిధిని రద్దు చేయగా.. చంద్రబాబు పునరుద్ధరించారని ఉద్ఘాటించారు.
Post Views: 32






