Mahaa Daily Exclusive

  గత సంవత్సరం లాభాల వాటా 35 శాతం ఇవ్వాలి మందమర్రి జిఎం కార్యాలయం ముందర గుర్తింపు సంఘం ధర్నా ..!

Share

మందమర్రి, మహా : గత 2024- 25 సంవత్సరం సింగరేణి సంస్థ గడించిన లాభాలలో కార్మికులకు 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి మందమర్రి జిఎం కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గత స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సొంత ఇంటి సహకారం, పెర్క్స్ పై ఇన్కంటాక్స్, మారు పేర్ల సమస్య, తదితర డిమాండ్లపై సర్క్యులర్ రూపకంగా జారీ చేయాలని తమ యూనియన్ డిమాండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ మాట వినకుండా యాజమాన్యం మొండికేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను పట్టించుకోవాలని అన్నారు.
సింగరేణి యాజమాన్యం ఈ వారం రోజుల్లో లాభాల మాట ప్రకటించకుంటే తమ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కార్యకర్తలు, సివిక్ కాంటాక్ట్ కార్మికులతో పాటు రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ ఆలీ, బెల్లంపల్లి కార్యదర్శి దాగం మల్లేష్, ఆ యూనియన్ ఉపాధ్యక్షులు భీమనాథని సుదర్శన్, తిరుపతి గౌడు,ఏరియా నాయకులు ఇప్పకాయల లింగయ్య, సోమిశెట్టి రాజేశం, కంది శ్రీనివాస ,పెద్దపెల్లి బానయ్య, సి.వీ. రమణ, ఎగేటి రాజేశ్వరరావు, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, గోపతి సత్యనారాయణ, రాజేష్ కుమార్ యాదవ్, పిట్ కార్యదర్శిలు గాండ్ల సంపత్, మీనుగు లక్ష్మీనారాయణ, గొల్ల శ్రీనివాస్, సిహెచ్ పి శర్మ,
కందకట్ల ఓదెలు, ప్రేమ్లాల్
సట్ల కొండయ్య,. తదితరులు పాల్గొన్నారు, అనంతరం పలు డిమాండ్ల వినతి పత్రాన్ని ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయ ప్రసాద్ కు అందజేశారు.

గుర్తింపు సంఘం ధర్నా చేయడం సిగ్గుచేటు

సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటియుసి) ధర్నా చేయడం సిగ్గుచేటని మందమర్రి ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు దేవి భూమయ్య వాక్యానించారు. గత స్ట్రక్చర్ సమావేశాన్ని రద్దు చేసుకొని ఇలాంటి నీతి వాక్యాలు వహించడం తగదని ఆయన హితవుపలికారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్త స్ట్రక్చర్ సమావేశాన్ని రద్దు చేసిన సంగతి గురించి ఇదివరకే తమ యూనియన్ పాత్రికేయులకు తెలియపరచిందని ఆయన చెప్పారు. సింగరేణి కంపెనీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. నిజా నిజాలను కార్మిక వర్గం పరిశీలించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest