Mahaa Daily Exclusive

  వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల

Share

TG: పత్తి రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. 2025-26 సీజన్ పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని సీసీఐ, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. రోజువారీ క్రయవిక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Latest