బెల్లంపల్లి ,మహా: బెల్లంపల్లి పట్టణ సర్కిల్ పరిధిలోని ప్రజలు పండగ ఉత్సవాలను పురస్కరించుకొని సొంత ఊర్లకు పలు పట్టణాలకు పయనమై పోతున్న తరుణంలో తమ విలువైన వస్తువులను కాపాడుకు
నేందుకు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి రూరల్ హనోక్ పిలుపుని
చ్చారు. సోమవారం నాడు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడు
తూ పండుగలను ఉత్సాహపూరి
తంగా నిర్వహించాలని తమ విలువైన బంగారు నగలు విలువైన ఆభరణాలు నగదులను బ్యాంకులో ఆఖరులలో దాచుకునేలా ఏర్పాటు చేసుకోవాలని దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు
లకు సహకరించాలని సూచించారు.
దసరా బతుకమ్మ ఉత్సవాల నేపథ్యం
లో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమవుతున్న వేళ దొంగలు విలువైన వస్తువులను అపహ
రించేందుకు ప్రయత్నాలు చేస్తారని నూతన వ్యక్తులను అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినట్లయితే పోలీసు
లకు సమాచారం ఇవ్వాలని సంబం
ధిత పోలీస్ శాఖ నిరంతరం ప్రజాసే
వకు అంకితం అవుతారని పేర్కొన్నా
రు దసరా సెలవులకు ఇంటికి వచ్చే విద్యార్థులు చెడువాసాలకు దూరంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల అలవాటులను నిశితంగా పరిశీలించాలని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును అప్రతిష్ట పాలు చేసుకోవద్దని ఆయన సూచిం
చారు.






