ఆదిలాబాద్ మహా : గత 49 ఏళ్లుగా లంబాడా,సుగాలి, బంజారాలు తమ రిజర్వేషన్లు దోచుకుంటున్నారని చట్టబద్దత లేని వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… ఆదివాసీ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.ఆదిలాబాద్ రూరల్ మండలం గోండ్వానా పంచాయతీ ఉమ్మడి రాయిసెంటర్ తొమ్మిది తెగల ఆదివాసీల ఆధ్వర్యంలో సోమవారం తంతోలి ముత్యాలమ్మ గుడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.సంప్రదాయ డోలు వాయిద్యాలతో తరలివచ్చి ఆదిలాబాద్ పట్టణంలోని కుమురం భీం చౌక్ లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ స్రవంతి అక్కడికి చేరుకొని మాట్లాడానికి యత్నించిన ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని నేతలు పట్టుబట్టారు. ప్రధాన రంగాల్లో గత 49 ఏళ్లుగా తమకు వచ్చిన అవకాశలను లంబాడీ లు కొల్లగోడుతున్నారని ఆరోపించారు. 1977లోఎమర్జెన్సీ సమయంలో లంబాడీలు లేరని, తరువాత వారు ఆదివాసులు ఎలాఅవుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడేంత వరకు లంబాడీలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గణేష్, తనాజీ, వెంకటేష్, సోనేరావ్, జంగు పటేల్, విశ్వంబర్,తదితరులు పాల్గొన్నారు






