Mahaa Daily Exclusive

  నేడు సింగరేణి కార్మికుల ఖాతాల్లో బోనస్‌ జమ..!

Share

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించిన విషయం తెలిసిందే. లాభాల్లో 34శాతం వాటా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో నేడు సింగరేణి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. మొత్తంగా కార్మికుల ఖాతాల్లో రూ.819 కోట్లు పడనున్నాయి. సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం కార్మికులకు ప్రభుత్వం ఇవ్వనుంది.

Latest