స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) సాయంత్రంలోగా రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ సూచించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఇటీవల చేసిన కులగణన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు.
Post Views: 29






