Mahaa Daily Exclusive

  ఘనంగా బెల్లంపల్లిలో సద్దుల బతుక మ్మ వేడుకలు ..!

Share

బెల్లంపల్లి, మహ: తెలంగాణ సాంప్ర
దాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో ఆడపడుచులు సోమవారం నాడు ఘనంగా నిర్వహిం
చారు పట్టణంలోని అన్ని వీధులలో పట్టణ మహిళలు ఆయా వార్డులలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ఉద
యమే పూలను సేకరించి బతుకమ్మ
ను పేర్చి పూజా కార్యక్రమాలు నిర్వ
హించి సాయంకాలం ఆటపాటలతో వేడుకలను పట్టణ మహిళలు జరు
పుకున్నారు. ఈ సందర్భంగా పలువు
రు మహిళలు మాట్లాడుతూ తెలంగా
ణ ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఏడు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ
గా వస్తుందని అందులో భాగంగా తొమ్మిది రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో రీతిలో బతుకమ్మను పేర్చి వాయనాలను ఆడపడుచులకు ఇచ్చి సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిం
చడం జరుగుతుందని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా
నిమజ్జనం చేసేందుకు పోచమ్మ చెరు
వు వద్ద అన్ని రకాల ఏర్పాట్లను పట్ట
ణ యంత్రాంగం ఎమ్మెల్యే ఆధ్వర్యం
లో ఏర్పాట్లను చేశారు చెరువులో నిమజ్జనం చేసేందుకు సంబంధిత విద్యుత్ శాఖల తోపాటు రెవెన్యూ, పోలీసు,మున్సిపల్ శాఖల సమన్వ
యంతో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది.

Latest