AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆల్మట్టి ఎత్తు పెంపుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచడం వలన అదనంగా 100 టీఎంసీల కృష్ణాజలాలు వాడుకునే అవకాశం ఉందని, దీని వల్ల రాయలసీమకు తాగునీరు, నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన విషయంపై అసెంబ్లీలో చంద్రబాబు ఒక్కసారైనా చర్చించారా? అలాగే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చించారా? అని ఆయన ప్రశ్నించారు.
Post Views: 53







