ఆదిలాబాద్ మహా : తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. బుధవారం బేల మండలం సిర్సన్న గ్రామంలోని రెడ్డి సంఘ భవనం వద్ద మహిళలు తమ సౌభాగ్యానికి ప్రతీకయైన గాజులు , పూలు, కుంకుమ, గోరింటాకు పూజ నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి పుట్టిన ఊరులో బంధుమిత్రులు , కుటుంబ సభ్యులు గ్రామ మహిళలు ఒకరికొకరు గాజులు, పూలు, పసుపు,కుంకుమ. గోరింటాకు పంచుకున్నారు. అనంతరం వేడుకగా బతుకమ్మల వద్ద ఆటపాటలు నిర్వహించారు.
Post Views: 46








