ఆదిలాబాద్ మహా : స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పీటీసీ, ఎంపీటీసీలు గా పోటీచేసే అభ్యర్ధుల విషయంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి కార్యాచరణ సిద్ధం చేసారు. బుధవారం తన క్యాంపు ఆఫీస్ లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధుల ఎంపిక కోసం ఆశావహుల జాబితా సిద్దం చేయడానికి మండలాల వారీగా ఇంచార్జిలను నియమించారు. ఒక్కో మండలానికి దాదాపు ఎనిమిది నుండి పది మంది సమర్ధులైన నాయకులను నియమించి పోటీ కి తగిన విధంగా ఉండే అభ్యర్ధుల జాబితా సిద్దం చేయాలని ఆదేశించారు.
వారిచ్చిన జాబితాను అధిష్టానం సూచనలు సలహాలతో వడపోసి అభ్యర్ధులను ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Post Views: 50








