Mahaa Daily Exclusive

  దసరా ఉత్సవాల్లో పోలీసు సూచనలు పాటించాలి … బెల్లంపల్లి ఒకటో పట్టణ సిఐ శ్రీనివాసరావు ..!

Share

బెల్లంపల్లి,మహ: దసరా ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో రావణదహన కార్య
క్రమాన్ని హిందూ ఉత్సవ సమితి నిర్వ
హిస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సంద
ర్భంగా ఆయన బుధవారం నాడు మాట్లాడుతూ రావణ దహన కార్యక్ర
మంను తిలకించేందుకు బెల్లంపల్లి పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం సైతం వేల సంఖ్య
లో రావడం జరుగుతుందని తద్వారా రద్దీ ఏర్పడి ప్రజా రవాణాకు ఇబ్బంది ఏర్పడుతున్న దృష్ట్యా గురువారంరోజు కాంట చౌరస్తా నుండి బెల్లంపల్లి కన్నా
ల ఫ్లైఓవర్ వరకు వాహనాలను నిషే
ధించడం జరిగిందని పోలీసు సూచన
లు పాటించాలని అదేవిధంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా జేబుదొంగలు సంచరించే అవ
కాశం ఉందని తగిన జాగ్రత్తలు పాటిం
చాలని సూచించారు.రావణ దహన కార్యక్రమం అనంతరం హాజరైన పట్ట
ణ ప్రజలు బయటికి వెళ్లేందుకు మూడు మార్గాలను ఏర్పాటు చేసిన
ట్లు తెలిపారు.