Mahaa Daily Exclusive

  ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా ఆయుధపూజ ..!

Share

మందమర్రి, మహా : మందమర్రి ఏరియా వర్క్ షాప్ లో బుధవారం ఘనంగా ఆయుధపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జీఎం రాధాకృష్ణ, సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) మందమర్రి బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ గర్భగనులు, భూ ఉపరితన గనులలో రిపేర్లకు వచ్చిన యంత్రాల పరికరాలను త్వరగా బాగు చేయాలని వారు సూచించారు. కార్మికులు రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని అన్నారు. దుర్గ శరన్నవరాత్రుల సందర్భంగా కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు దసరా పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పండగను పురస్కరించుకొని కార్మికులు ఎలాంటి గొడవలకు పోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ డివైజిఎం ధూప్ సింగ్, పిట్ కార్యదర్శి సి హెచ్ పి శర్మ, ఇంజనీర్లు సదానందం, నరేష్, శ్రీనివాస్, సత్య గౌడ్, పారిపళ్లి రాజేశం, బి సుదర్శన్, కొండ్రు వెంకటేశం, జాడి సంతోష్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Latest