దసరా సందర్భంగా అభిమానులకు నటి సమంత అప్‌డేట్ ఇచ్చారు. తన కొత్తింటి ఫొటోను షేర్ చేస్తూ ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. గోడపై ఉన్న SAM లోగో ఆకర్షణగా నిలిచింది. అయితే ఇల్లు హైదరాబాద్‌లోనా, ముంబైలోనా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఆరోగ్య సమస్యల తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న సమంత, ఇటీవల ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో నటిస్తున్నారు.
Post Views: 66








