ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఆసియా పసిఫిక్ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆన్ లైన్ లో సమావేశమయ్యారు. ఏపీలో స్థానిక భాగస్వామ్యంతో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు వారితో చర్చించారు.
ఈ సమావేశం ఎంతో సంతోషం కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంటెంట్ డెవలప్ మెంట్, స్కిల్ డెవలప్ మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను ప్రోత్సహించేలా ఈ యూట్యూబ్ అకాడమీ ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా, ఏపీ రాజధాని అమరావతిలో మీడియా సిటీ ఏర్పాటుకు సాంకేతిక మద్దతును అందించే దిశగా పలు విధానాలను పరిశీలించామని చంద్రబాబు తన ట్వీట్ లో వివరించారు. అమరావతి రాజధానిలో భాగంగా మొత్తం 9 థీమ్ సిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సంకల్పించారు. వాటిలో ఒకటి మీడియా సిటీ.
Post Views: 8