Mahaa Daily Exclusive

  పాకిస్థాన్ ప్రధాని ముందే.. మోదీ, భారత్‌ను ఆకాశానికెత్తిన ట్రంప్ …ముఖం మాడ్చుకున్న షెహబాజ్

Share

మహా

పాకిస్థాన్ ప్రధానికి ట్రంప్ షాకిచ్చారు. ఈజిప్టులో జరిగిన శాంతి సదస్సులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కళ్లెదుటే భారత్, మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. భారత్ గొప్ప దేశం అని, ఆ దేశాన్ని పాలిస్తున్న తన మిత్రుడు మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ ముఖం మాడ్చుకున్నారు. అక్కడితో ఆగని ట్రంప్.. భారత్-పాక్ కలిసి జీవిస్తాయని చెప్పి.. షరీఫ్ ముఖం చేశారు. దీంతో ఆయన కూడా ట్రంప్‌ను చూసి చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈజిప్టులో జరిగిన శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన తర్వాత.. షర్మ్ ఎల్-షేక్ నగరంలో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సరిగ్గా తన వెనుకనే నిలబడి ఉండగా ట్రంప్ భారత్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. భారత్ ఒక గొప్ప దేశం అని.. అక్కడ నాయకత్వం వహిస్తున్న నా స్నేహితుడు అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో షెహబాజ్ షరీఫ్ ముఖం మాడ్చుకుని ఉన్నట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత ట్రంప్.. భారత్, పాకిస్థాన్ చాలా చక్కగా కలిసి జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యానించిన వెంటనే ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూడగా.. చిరునవ్వు నవ్వారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.