- జూబ్లీహిల్స్ దెబ్బకి గూబ గుయ్యిమనాలి
- కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితమం
- ఉప ఎన్నికలో మీ పార్టీ చిరునామా గల్లంతవుతుంది: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గూబ గుయ్యిమనేట్లు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. పదేళ్లలో ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుకు భారత రాష్ట్ర సమితి, భాజపాలదే బాధ్యత. మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ.. గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది’’ అని పొన్నం విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్ల వివాదంపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఓట్లపై నిజానిజాలు బయటపడతాయని, ప్రజలు ఎవరి కుట్రలనైనా తిప్పికొడతారని చెప్పారు.







