హైదరాబాద్, మహా
తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుమ్మల అసలు నీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారని, సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుందని నిలదీశారు. మంత్రులు పొన్నం, తుమ్మల వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారు.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వెంటనే స్పందించాల్సి ఉండేదన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోతే దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డను మంత్రులు అవమానించారని, మంత్రుల భాషను మహిళలు వినాలన్నారు.
Post Views: 44







