- క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంపు
- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, మహా : రామగుండం కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సెప్టెంబర్ మాసం నేరా సమీక్షలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనరేట్ పరిధి డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంచాలని సూచించారు.
అలాగే పాత యు.ఐ. అండ్ పీ.టి. కేసులను త్వరగ పరిష్కారించి, కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలి పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించి నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, కేసులు, పోక్సో కేసు లలో బాధితులకు కంపన్సేషన్ త్వరగా అందేలా చూసి, కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని అన్నారు. ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరాల నియంత్రణ కు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిందితుల పట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధగంట సమయం ప్రధాన చౌరస్తా, గ్రామాల వారిగా రోడ్ పై విషబుల్ గా ఉండాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం వలన మీ మీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ప్రసెన్స్ కనిపిస్తుందని చెప్పారు. తద్వారా మీ గుర్తింపు, పోలీస్ శాఖ కీర్తి పెరుగుతుందని వివరించారు. రోడ్డు ప్రమాదలలో ఎక్కువ శాతం యువత చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని తెలిపారు. పాఠశాల, కళాశాల, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసీ, రోడ్ రక్షణ వాలింటర్స్ ను తయారు చేయాలి అని ఆదేశించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని అన్నారు. సైబర్ నేరాల నివారణకు ఇంటిదగ్గ గ్రామాలు పట్టణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలని కోరారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందితే ఆయా కేంద్రాలలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝు తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ .భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, సీసీ పిఎస్ ఏసీపీ రంగా రెడ్డి, సిసియస్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.







