- ఉప ఎన్నిక.. స్థానిక ఎన్నికల్లోనూ పొత్తు
- మాకు చాన్స్ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్‌ను కోరాం: ప్రొఫెసర్ కోదండరాం
- టీజేఎస్ పార్టీ చీఫ్‌తో భేటీ అయిన మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాకుండా.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్- టీజేఎస్ మధ్య పొత్తు కొనసాగుతోందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కోదండరాంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్-టీజేఎస్ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలిచే తమ పార్టీ నేతలకు సంబంధించిన కొంత మంది అభ్యర్థుల జాబితాను టీపీసీసీ చీఫ్‌కు ఇచ్చానని, వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నన్నాని ఆయన మీడియాతో తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన టీజేఎస్‌కు భాగస్వామ్యం విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు






