Mahaa Daily Exclusive

  తెలంగాణలో నాలుగు రోజులు పాటు వానలే వానలు!

Share

  • తెలంగాణలో నాలుగు రోజులు పాటు వానలే వానలు!
  • – దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, మహా

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడి వాయిగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాలపై ఉంటుందని వివరించింది.

ఆ రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం :

గురువారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ 24 తేదీన ఉమ్మడి మహబూబ్​నగర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశామని అన్నారు. నైరుతి రుతుపవనాలు విరమణ సమయంలో ఈశాన్యగాలుల రాష్ట్రంలో ప్రవేశిస్తుంటాయని తెలిపారు. ఇవి పూర్తిస్తాయిలో విస్తరిస్తున్నాయని అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్​లో తుపానులు ఎక్కువగా ఏర్పడే అవకాశాలుంటాయని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతున్న ప్రాంతం గుర్తింపదగ్గ అల్పపీడనంగాను తరువాత రాగల 12 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు