Mahaa Daily Exclusive

  మీడియాపై దాడులు హేమమైన చర్య

Share

  • ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబి చౌరస్తాలో నిరసన

మంచిర్యాల, మహా : ప్రజలకు, ప్రభుత్వానికి నిస్వార్థ సేవలందిస్తున్న మీడియాపై ఒక పార్టీకి చెందిన దుండగుల దాడులు హేమమైన చర్యని మంచిర్యాల ఐక్య జర్నలిస్టు సంఘాల నాయకులు విమర్శించారు. గురువారం మంచిర్యాల ఐబి చౌరస్తా లో వరంగల్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఐక్య జర్నలిస్టు సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించారు. అన్యాయాలను అక్రమాలను దోపిడీలను నిక్కచ్చితంగ సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం మానుకోవాలని పితవు పలికారు. పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలని అన్నారు. నమస్తే తెలంగాణ కార్యాలయం పై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ సంఘాల నాయకులు రాజలింగు, చిట్ల రమేష్, పార్వతి సురేష్, ఉమేష్, బొడ్డు మల్లేష్, వంశీ, రాజు పటేల్, రమేష్ రెడ్డి, రాజు, నరేష్, వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్, దుడ్డేల తిరుపతి, పడాల సంతోష్, పార్వతి రాజేష్, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

Latest