Mahaa Daily Exclusive

  బీజేపీకి బీటీమ్ గా బీఆర్ఎస్ … మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం..

Share

జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌‌కు వస్తున్న ప్రజాస్పందన ఓర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రచారానికి మంచి ప్రజా స్పందన వస్తుందని, ప్రజా స్పందన చూస్తుంటే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని జోస్యం చెప్పారు. నవీన్ యాదవ్ గెలుపు లాంచనమేనని, బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ పని చేస్తుందని ఆరోపించారు. ఇక జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు.