Mahaa Daily Exclusive

  దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు:జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల

Share

  • దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
  • తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు
  • ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన
  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి

మెదక్ జిల్లా, మహా

ప్రభుత్వం వరి ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేస్తుందని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి స్పష్టం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలంలోని కొంతన్ పల్లి, ఉసిరిక పల్లి, రత్నాపూర్, సీతారాం తండా, అల్లిపూర్ మరియు పిల్లుట్ల, గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ రైతులు పంట ఉత్పత్తులను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, సీఈవో మధు యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బండారి గంగాధర్, సోనీ రావినాయక్ , పీఏసీఎస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పెంట గౌడ్, ఏఈవో వందన మౌనిక రాము , నాయకులు, పెద్ద ఎత్తున రైతులు వివిధ గ్రామల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Latest