Mahaa Daily Exclusive

  రంగంలోకి సీఎం

Share

  • రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
  • ఉప ఎన్నిక ప్రచారానికి షెడ్యూల్ ఖరారు
  • నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం ప్రచార షెడ్యూల్‌ను హస్తం పార్టీ నేతలు ఖరారు చేశారు. నాలుగు రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ నెల చివరిలో పోలీస్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్టోబర్ 30, 31, నవంబర్ 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి రోజు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు నేరుగా సీఎం రేవండ్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేదానిపై సీఎం రేవంత్ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Latest