గుండాల ఆగస్టు 12 –:గుండాల మండల కేంద్రంలో అఖిల విద్యార్థి సమాఖ్య AISF ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కె షాహిద్ అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం ఉద్యమంలో దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12 న AISF ఆవిర్భవించింది.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన – స్వాతంత్రోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం AISF. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, సోషల్ విద్యావిధానం అమలుకై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 88 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి పోరాటాల మార్గాన్ని ఎంచుకొని గల్లి నుండి ఢిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా – పోరాటాలే ప్రాణంగా – విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం – చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించిన ఏకైక సంగంAISF.
శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 88 వసంతాలు పూర్తిచేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న.ఈ కార్యక్రమంలో AISF నాయకులు పల్లెర్ల రవి వర్మ మండల అధ్యక్ష కార్యదర్శులు , కొప్పుల పవన్ కళ్యాణ్, గడ్డం వరుణ్,ఎస్కే నసీర్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు







