Mahaa Daily Exclusive

  గ్రామపంచాయతీ కార్మికులును పర్మినెంట్ చేయాలి..కనీస వేతనం 26,000 ఇవ్వాలి..పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలి..-సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్..

Share

అశ్వరావుపేట, ఆగస్టు 12: గ్రామపంచాయతీ కార్మికులును పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు సమస్యల పరిష్కరించాలని ఒక రోజు సమ్మెలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఒక్క సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ మండల నాయకులు వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగిన సభలో అర్జున్ మాట్లాడుతూ అర్హులైన వారిని కార్యదర్శులుగా నియమించాలని జీవో 51ని సవరించాలని విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అందరికీ పిఎఫ్ ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని ధహన సంస్కారాలకు 30000 రూపాయలు ఇవ్వాలని వయసు మీరిందనే పేరుతో ఉద్యోగాలను తొలగించవద్దని అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల ను అనేక భ్రమలు పెట్టిందని ఆనాడు సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టెంట్ దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇచ్చారని కానీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్న ఇంతవరకు వారి డిమాండ్లను నెరవేర్చలేదని పెండింగ్ వేతనాలు ఇవ్వలేదని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ లను నెరవేర్చాలని లేనియెడల భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నరసింహారావు యూనియన్ నాయకులు ముత్తారావు,బుజ్జమ్మ, మహేష్, మల్లయ్య, భూషణం, రామారావు తదితరులు పాల్గొన్నారు.