Mahaa Daily Exclusive

  నేటి కేబినెట్ సమావేశం వాయిదా …ఈ నెల 12 కు వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం

Share

హైదరాబాద్, మహా: నేడు జ‌ర‌గాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా ప‌డింది. ఈనెల 12న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివ‌రిసారిగా జ‌రిగిన కేబినెట్‌లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్‌ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్ర‌భుత్వం వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు గ‌త కేబినెట్ స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 21(3)ని తొలగించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివ‌రించారు

Latest