- కాసేపట్లో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- డ్రోన్ ల ద్వారా పర్యవేక్షణ
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపట్లో ప్రారంభమయ్యే పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాల వివరాలు కేటాయించారు. వారంతా తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్ కు సన్నద్దమయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఏర్పాట్లను వ్యక్తిగతంగా పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా భద్రతా చర్యలను సమీక్షించిన ఆయన, డ్రోన్ల సాయంతో సెక్యూరిటీ మానిటరింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఈసారి డ్రోన్ ల ద్వారా పోలింగ్ సరళిని పరిశీలంచనున్నారు. అభ్యర్థుల నియంత్రణలో భాగంగా, ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ మాత్రమే జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి నిలిపిన నేపథ్యంలో, పోలింగ్ రోజు చట్టవ్యవస్థ పర్యవేక్షణ కోసం పోలీస్ దళాలను విస్తృతంగా మోహరించారు. పోలింగ్ భద్రత కోసం దాదాపు 5 వేల మందిని భద్రతా ఏర్పాట్ల కోసం నియమించారు.








