Mahaa Daily Exclusive

  ప్రత్యక్షసాక్షుల లైవ్ రిపోర్ట్ ….మా కళ్ళముందే..

Share

(ఢిల్లీ-మహా)

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది.పేలుడు చాలా శక్తివంతంగా ఉందని, భవనాల కిటికీలు కూడా తెరిచి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “నేను నా దుకాణంలో కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా అంత పెద్ద పేలుడు సంభవించి నా కుర్చీలోంచి పడిపోయాను. నా జీవితంలో ఇంత శక్తివంతమైన పేలుడు శబ్దం నేను ఎప్పుడూ వినలేదు” అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

ఆకాశానికి మంటలు ఎగిసిపడ్డాయి

మరో ప్రత్యక్ష సాక్షి రాజ్‌ధర్ పాండే మాట్లాడుతూ, తాను ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని చెప్పారు. దీంతో తాను టెర్రస్‌పైకి వెళ్లి చూడగా ఆకాశానికి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసినట్లు వెల్లడించాడు. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అంతటా గందరగోళం నెలకొందని తెలిపాడు. సంఘటన స్థలంలో ఉన్న మరో స్థానిక నివాసి మాట్లాడారు. పేలుడు సంభవించిన తర్వాత తాము అక్కడికి చేరుకున్నప్పుడురోడ్డుపై ఒకరి చేయి పడి ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాము పూర్తిగా షాక్‌లో ఉండిపోయినట్లు చెప్పిన స్థానికులు ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉందని పేర్కొన్నారు. సమీపంలోని అనేక కార్లు దెబ్బతిన్నాయని,శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు చెప్పారు. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదని వివరించారు.

Latest