Mahaa Daily Exclusive

  బీహార్‌ రెండో దశ పోలింగ్‌… ఎన్డీఏ, ఆర్ జేడీలకు ప్రతిష్టాత్మకం…

Share

మహా
బీహార్ తుదివిడత పోలింగ్ మంగళవారం జరగనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్‌ నిర్వహించగా.. రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది (దాదాపు 10 శాతం) మహిళలే. రెండవ దశలో పోలింగ్‌ జరగనున్న 122 స్థానాలు బీహార్‌లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. బీజేపీకి సంప్రదాయకంగా తిర్హుత్‌, సారణ్‌, ఉత్తర మిథిలాంచల్‌ ప్రాంతాలలో గట్టి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్‌పూర్‌ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాఘట్‌బంధన్‌కు మగధ్‌ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయ, ఔరంగాబాద్‌, నావడ, జెహనాబాద్‌, అర్వాల్‌ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా మంగళవారం సాయంత్రమే రానున్నాయి.
….

Latest