Mahaa Daily Exclusive

  ఉగ్ర దాడిపై ఉక్కుపాదం …ప్రతి దోషిని వేటాడండి.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అమిత్ షా

Share

  • ఉగ్ర దాడిపై ఉక్కుపాదం
  • ప్రతి దోషిని వేటాడండి.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అమిత్ షా
  • ప్రతి ఒక్క దోషిని వేటాడి పట్టుకోవాలని ఆర్డర్స్
  • ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి హోండోవర్.. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం

ఢిల్లీ, మహా: ఎర్ర కోట సమీపంలో జరిగిన భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పేలుడు అనంతర పరిస్థితులను ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. ‘ఢిల్లీ కారు పేలుడుపై సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాను. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని వారికి ఆదేశించాను. ఈ పేలుడులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి’ అని సమావేశాల అనంతరం అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని అంతకుముందు చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రంగంలోకి ఎన్ఐఏ..
ఉదయం నిర్వహించిన భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా హాజరయ్యారు. రెండో సమావేశంలోనూ దాదాపు ఈ ఉన్నతాధికారులే పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ పేలుడుపై మొదటగా ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేంద్రం దీన్ని ఉగ్ర చర్యగా భావిస్తున్నందున.. దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించారు. అయితే ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో ఫరీదాబాద్ డాక్టర్లకు సంబంధాలపై నివేదికలో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

Latest