Mahaa Daily Exclusive

  హరే కృష్ణ హెరిటేజ్  టవర్ ప్రాజెక్ట్‌కు విరాళం….

Share

  • హరే కృష్ణ హెరిటేజ్  టవర్ ప్రాజెక్ట్‌కు విరాళం
  • రూ. 50 లక్షల విరాళం అందజేసిన శ్రీనర్సింగ్ క్లాత్ ఎంపోరియం

హైదరాబాద్, మహా: హరేకృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు ప్రముఖ వ్యాపార సంస్థ శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 50 లక్షల విరాళం లభించింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింగానియా, డైరెక్టర్ రవికాంత్ సింగానియా ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళ చెక్కును హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభూజీకి అందజేశారు. దీంతో శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు మొత్తం విరాళంగా రూ. 1.14 కోట్లు అందించబడ్డాయి. అదే విధంగా ఈ సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 300 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని కూడా నిర్ణయించింది. ఈ సందర్భంగా సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ.. నర్సింగ్ క్లాత్ ఎంపోరియం సంస్థ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యాపార సంస్థల సహకారం వల్లే భారతదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందుతుంది అని కొనియాడారు.

Latest