Mahaa Daily Exclusive

  ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి కామెంట్స్…

Share

  • ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి కామెంట్స్
  • సానుభూతిని పొందే ప్రయత్నం.. కానీ జరగదు
  • మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికల్లో ఓడిపోతున్నామన్న అసహనంతో బీఆర్ఎస్ అభ్యర్థి మూడు రోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. తమ అభ్యర్థిని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ.. సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం పొన్నం ప్రభాకర్​మీడియాతో మాట్లాడుతూ.. తల్లి మీకు దండం పెట్టుకుంటున్నాం.. ఎన్నికల్లో మీరు పోటీ చేసినారు.. మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించారా? లేదా? అనే అంశం పక్కన పెట్టి.. మా అభ్యర్థి విజయం కోసం మా పార్టీ నాయకత్వం అంతా కలిసి పని చేశామన్నారు. ఏ పార్టీ నాయకులైనా వారు స్థానికేతరులైతే ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎవరు కూడా ఎక్కడ నియోజకవర్గంలో కనబడడానికి వీలులేదని, ఈసీ తమ కార్యాచరణ ప్రకారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ అయినా కేసులు పెట్టుకోవచ్చన్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందాలనే ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ​చెప్పారు.