అశ్వారావుపేట నియోజకవర్గం, ఆగస్ట్, 13: అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామంలోని పెద్దలు పట్టణాలలో స్థిరపడి వారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తమ వంతుగా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నా అశ్వారావు పేట శాశన సభ్యులు జారే ఆదినారాయణ సైకిల్ అందించిన దాతలను అభినందించి తన చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 20







