Mahaa Daily Exclusive

  యూరియా కట్టల కోసం పిఎసిఎస్ ముందు ధర్నా..

Share

గుండాల ఆగస్టు 13: మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం ముందు ప్రజాపంద మాస్ లైన్ ఆధ్వర్యంలో యూరియా కట్టల కోసం రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం మండల అధ్యక్షులు పూనేం లక్ష్మయ్య, మండల కార్యదర్శి కొమరం శాంతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మందు కట్టల విషయం విఫలమైందని అన్నారు. సకాలంలో రైతులకు మందు కట్టలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్, జగన్, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు