మహా కోదాడ: మునగాల మండలం, కలకోవ గ్రామానికి వెళ్లే దారిలో రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల వ్యవసాయం ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యాన్ని ఆరబోయటానికి కల్లాలుగా వాడుకుంటున్నారు. కోసిన ధాన్యాన్ని ఆరబోసి, ధాన్యాన్ని సాయంత్రం కుప్పలుగా చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రి సమయంలో కుప్పలు గమనించకపోవడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది మండల పరిధిలోని రోడ్లపై ధాన్యం ఆరబోసిన రాశులు కనబడక బైకర్లు, ఆటోలు డీకోని ప్రమాదాలకు గురైనారు. ప్రస్తుతం మండలములోని పంటలను ఆరబోయడానికి రోడ్లను ఎంచుకున్నారు.
రాత్రివేళ ప్రయాణమంటేనే భయమేస్తోంది.
ఆలేటి మహేష్ ప్రయాణికుడు
బైకుపై నిత్యం పనులు ముగించుకొని రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్తుంటా. ఈ సీజన్లో రాత్రివేళ బైక్ నడపాలంటేనే భయమేస్తోంది. రోడ్లపై ధాన్యం కుప్పల మీద నల్లటి కవర్ కప్పడంతో రాత్రి సమయంతో బీటీ రోడ్డు మాదిరిగానే కనిపిస్తోంది. వాహనదారులు గమనించక పోతే ప్రమాదానికి గురికావాల్సిందే. రోడ్లపై కల్లాలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలి.
రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని, వాహనాదారులు ప్రయాణికులు పోలీసులును కోరుతున్నారు.








